నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా
గుంటూరులో తన కూతురు కనిపించడం లేదని ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు.. పట్టించుకోని పోలీసులు
గుంటూరు జిల్లా ఆర్.ఆగ్రహారంలో తన కూతురు(15) కనిపించడం లేదని గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఫిర్యాదు చేసిన ఏసోబు అనే దివ్యాంగుడు
4 నెలల తరువాత ఒక కొత్త నంబర్ నుండి తన కూతురు ఫోన్ చేసి, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నానని చెప్పిందని, అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరో ఫోన్ కట్ చేశారని, ఈ విషయం చెప్పినా కూడా పోలీసులు కనీసం స్పందించలేదని తండ్రి ఏసోబు ఆవేదన
మరికొన్ని రోజుల తర్వాత అదే నెంబర్ నుండి ఫోన్ చేసి, మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారని, ఆ ఫోన్ నంబర్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని మండిపాటు
ఇప్పటికైనా తన కూతురు బతికి ఉందో, చనిపోయిందో తేల్చాలని పోలీసుల ముందు కన్నీటి పర్యంతమైన బాలిక తండ్రి
