ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్టీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లుగా ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
వీరికి పూర్వ కమిషనర్ సునీల్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో వజ్జా శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
