కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను 56 స్థానాలతో బీజేపీ కైవసం చేసుకోవడం చారిత్రక విజయం. ఈ సందర్భంగా ఢిల్లీ వెళ్తున్న విజేతలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పాతూరి నాగభూషణం తదితరులు వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
