ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సేంద్రీయ సాగు అభివృద్ధికి, పీఎం-ప్రణామం (PM-PRANAM) నిధుల విడుదలపై చర్చించారు.
కొబ్బరి సాగు కోసం రూ. 200 కోట్లు, పెండింగ్ మైక్రో ఇరిగేషన్ నిధులు రూ. 695 కోట్లు విడుదల చేయాలని కోరారు. మామిడి రైతులకు ఆర్థిక సాయం, కొల్లేరు ప్రాంతంలో మఖానా బోర్డు ఏర్పాటుపై కేంద్ర సహకారాన్ని విజ్ఞప్తి చేశారు.
