పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం స్థానికులు ఈ ఘటనను గుర్తించారు.
మృతుడిపై ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. నంగిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ లో వెల్లడి కానున్నాయి # కొత్తూరు మురళి.
