మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. గత నవంబర్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఈ కేసు నమోదైంది.
