Home South Zone Andhra Pradesh అంబటి ఇంటి దాడిపై ఉషశ్రీ చరణ్ ఖండన |

అంబటి ఇంటి దాడిపై ఉషశ్రీ చరణ్ ఖండన |

0

నేడు గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, రాష్ట్ర వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర గారు మరియు పెనుకొండ నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ నాయకులు..
ఉషశ్రీ చరణ్ గారు మీడియాతో మాట్లాడుతూ..

మాజీమంత్రి అంబటి రాంబాబు గారి నివాసంపై ఇటీవల జరిగిన దాడి, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనం అన్నారు, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థ పై దాడి చేయడం నేరమని ఉషశ్రీచరణ్ గారు స్పష్టం చేశారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నారు. అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి ఇంటిపై దాడి చేయడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది,ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో మరింత ఆగ్రహం వస్తుందని హెచ్చరించారు..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారికి, ఆయన కుటుంబానికి పూర్తి సంఘీభావంగా నిలుస్తుందని, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివర వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version