Home South Zone Andhra Pradesh చిల్లపల్లి శ్రీనివాస్ జన్మదినం: అన్నదానం చేసిన జనసేన నాయకులు.

చిల్లపల్లి శ్రీనివాస్ జన్మదినం: అన్నదానం చేసిన జనసేన నాయకులు.

0

అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నీరుగుట్టువారిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మెన్, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ బీసీ నాయకులు బండి మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన అడపా సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. అన్నదాన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్‌తో పాటు నరేంద్ర, చిట్టి, శివ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version