చీరాల ప్రధాన మసీదు సెంటర్ వద్ద డ్రైనేజీపై కవర్లు, గ్రిల్స్ లేకపోవడంతో నిత్యం ప్రమాదకరంగా మారింది. మద్యం బాబులు, కూలీలు డ్రైనేజీ అంచున కూర్చుంటుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో వర్షాలకు డ్రైనేజీ పూడిపోయి రోడ్లు మునిగిన ఘటనలు ఉన్నాయని, వెంటనే అధికారులు స్పందించి గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
#Narendra
