Home South Zone Andhra Pradesh తొలి తెలుగు సమరయోధుడు ఉయ్యాలవాడ: ఏపీఎస్పీ బెటాలియన్‌లో నివాళులు

తొలి తెలుగు సమరయోధుడు ఉయ్యాలవాడ: ఏపీఎస్పీ బెటాలియన్‌లో నివాళులు

0

మదనపల్లి సమీపంలోని 11వ బెటాలియన్‌లో తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1857 సంగ్రామానికి ముందే ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి నరసింహారెడ్డి అని ఆయన కొనియాడారు.

కమాండెంట్ ఆనందరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

NO COMMENTS

Exit mobile version