గంపలగూడెం మండలం నెమలి క్షేత్రంలో ఫిబ్రవరి 28 నుండి మార్చి 5 వరకు జరిగే శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కి అధికారిక ఆహ్వానం అందింది. ఆదివారం ఆలయ ఏసీ సంధ్య, ప్రధాన అర్చకులు ఎంపీని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మార్చి 4, 5 తేదీల్లో నిర్వహించే ‘పూటి లాగుడు’ ప్రదర్శన కరపత్రాన్ని ఎంపీ ఆవిష్కరించారు. మార్చి 2న స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది.
