చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రవాణా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ తో కలిసి ఆయన ఈ పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
