మదనపల్లి నర్సింగ్ హోం వీధికి చెందిన షేక్ ఖాసీమ్ సాబ్, షహనాజ్ దంపతులు తమ కూతురు షేక్ రఫియాపై సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిని రఫియా మోసపూరితంగా తన పేరిట రాయించుకుందని.
ఇప్పుడు ఊతకర్ర సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్న తమను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని వేధిస్తోందని బాధితులు వాపోయారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
