మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు.
అనంతరం భారీ ర్యాలీ మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాసరనేని జశ్వంత్, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు.
