Home South Zone Andhra Pradesh జీతాల పెంపుపై అంగన్‌వాడీలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము!

జీతాల పెంపుపై అంగన్‌వాడీలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము!

0

గుడివాడలో అంగన్‌వాడీ కార్యకర్తలతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాల వల్ల జీతాల పెంపు కొంత ఆలస్యమైనా, త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.

తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు అంగన్‌వాడీ సోదరీమణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, జనసేన ఇన్‌ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొని అంగన్‌వాడీలకు అండగా ఉంటామని ప్రకటించారు.

NO COMMENTS

Exit mobile version