CM Chandrababu Naidu Tours Nandyala District Today
డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయనున్న సీఎం
కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్రబాబు
స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఇవాళ ఉదయం 10:00 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి, 11:20 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామ సభలో, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:40 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రోజంతా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:40 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.
