వయసు 45 దాటిన వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు వెల్లుల్లి ఒక అద్భుత ఔషధమని పరిశోధనలు చెబుతున్నాయి. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా, దెబ్బతిన్న DNAను రిపేర్ చేస్తాయి.
అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థల అధ్యయనాల ప్రకారం, వెల్లుల్లి క్రమం తప్పకుండా తీసుకుంటే పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు 35 శాతం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది రక్తాన్ని సహజంగా పల్చబరిచి గుండెపోటు, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. అయితే, వెల్లుల్లిని దంచిన 10 నిమిషాల తర్వాతే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న అలవాటు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
