అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ముగింపు వేడుకలు రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశి కిరణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించడమే కాక, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, మద్య పాన నిషేధం కోసం నిరాహార దీక్ష చేసి, గ్రామీన ప్రజలను చైతన్యం చేసిన తొలి మహనీయుడని కొనియాడారు.
రిటైర్డ్ ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ “ఆంధ్ర జాతి పిత” గా అమరజీవి పొట్టి శ్రీరాములును ప్రతివొక్కరు గౌరవించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షురాలు సూరంపల్లి తేజస్వి, కార్యదర్శి జిఎవి ప్రసాద్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పసుపుల వందనం, తడవర్తి చంద్ర శేఖర్, కేబిఎస్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణ, జీవిత సభ్యులు కాటి రామారావు, ఎస్ పవన్ కుమార్, ఎన్ వెంకటేష్, న్యాయవాది చేబ్రోలు రాజేశ్వరి పాల్గొన్నారు.
