నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.

0
23

బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు కోతకు గురై అటుగా వెళ్తున్న స్థానికులకు విద్యార్థులకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిత్యం ఎంతో రద్దీగా రాకపోకలు సాగించే ఈ రోడ్డు కుంగిపోవడం కారణంగా అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు రాత్రి పూట పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనఅవసరంలేదు ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రమాదాల నివారణకు స్థానికులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప వేసి మార్గాన్ని మూసివేసి వేరొక మార్గంగుండా రాకపోకలు సాగిస్తున్నారు రోడ్డు దయనీయ పరిస్థితి కారణంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్ని ఎక్కించుకొని వెళ్లే బస్సులు దూరంగా ఆపి నడుచుకుంటు వచ్చి ఎక్కమిని కోవడంతో చేసేది ఏమీలేక విద్యార్థులు ముళ్లకంపలు దాటుకుంటు రాకపోకలు సాగిస్తున్నారు ఇంక రైతుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది అటు వైపు ఉన్న పంట పొలాలకు వెళ్లాలన్న చేతికి వచ్చిన పంట మార్కెట్ కి తీసుకువెళ్లాలన్న దిక్కుతోచని పరిస్థితి స్థానిక అధికారులు నాయకులు సమస్య తీవ్రతను పరిశీలించి పరిష్కారం చూపాలని అక్కడ నివసిస్తున్న స్థానికులు అటుగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు కోరుతున్నారు..