పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం

0
1

*పంచూడోలా యాత్ర… 400 ఏళ్లనాటి ఆచారం!*

 

ఒడిశా :

ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే ‘పంచూడోలా’ యాత్ర పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. హోలీ పండుగ తర్వాత 24 గ్రామాల ప్రజలు తమ ఇష్టదైవాలను ఆలయ ఆకృతుల్లోని పల్లకీల్లో ఉంచి, సరస్సు నీటిలో ఊరేగింపుగా మోసుకెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. సుమారు నాలుగు శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా, దైవ విగ్రహాలను సరస్సు మధ్యలో ఉండే మట్టిదిబ్బల వద్దకు చేర్చి ఘనంగా జాతర నిర్వహిస్తారు.