ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్, గంగరాజు, శివ అనే ముగ్గురు యువకులు బైకుపై మదనపల్లె టమాటా మార్కెట్ వైపు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.










