నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.

0
3

మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు మర్పూరి వీధిలోని ప్రెస్ క్లబ్‌లో ఘన సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కురుబ కురుమ సంఘం అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.

మదనపల్లెకు చెందిన బెల్లె రెడ్డి ప్రసాద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తంబళ్లపల్లికి చెందిన లక్ష్మన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పీలేరు నుంచి కాంతారావు, రాయచోటి నుంచి రఘునాథ్‌లకు రాష్ట్ర స్థాయి పదవులు లభించడంతో నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.