డా వివేక్ వెంకటస్వామి మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాముఖ్యతపై అంబేద్కర్ గారు చూపిన దారిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, బలహీన వర్గాల అభివృద్ధి ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. యువత చదువు ద్వారా ఎదిగి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు.










