అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ పోలీసు సిబ్బంది విధుల్లో పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.










