ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్. రాధిక హెచ్చరించారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఐసిటిసి సిబ్బంది, కౌన్సిలర్లు, వైద్యులతో మాట్లాడుతూ, మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, హెచ్ఐవి స్క్రీనింగ్, చికిత్సలో 95% లక్ష్యాలు, వైరల్ లోడ్ నియంత్రణలో 99% లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు










