అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం నిమ్మనపల్లె పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పుల గది, ల్యాబ్, మందుల నిల్వలు, రోగుల పడకలు, పరిశుభ్రతను పరిశీలించారు.
మండలంలోని గర్భిణీలకు స్థానికంగానే ప్రసవాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి వ్యాధులు, వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.










