ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కాంచీపురం లోనే కంచి కామకోటి పిఠాని సందర్శించి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా మంత్రిగారు పీఠంలో నిర్వహించిన
పూజ కార్యక్రమాల్లో పాల్గొని మహాస్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు మహాస్వామి వారు మంత్రి గారిని ఆశీర్వదిస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మంత్రిగారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక శక్తి మనిషికి ధైర్యం దిశను ఇస్తుందని మహాస్వామి వారి ఆశీస్సులు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు మంత్రి గారి అనుచరులు పాల్గొన్నారు










