మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*
నందిగామ,ఎన్టీఆర్ జిల్లా
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీని శుక్రవారం బండిపాలెం మదీనా మసీదు కమిటీ సభ్యులకు అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ బిజెపి నాయకులు సైదా ని కమిటీ సభ్యులు ఏసిని అడగగా వెంటనే అందజేస్తానని కమిటీ సభ్యులకి భరోసా ఇచ్చారు. పది రోజులు తర్వాత వెంటనే బండిపాలెం మసీదు కమిటీ సభ్యులను పిలిపించి ఏసీ ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి సైదా మాట్లాడుతూ నమాజ్ చదివే భక్తులకు ఎండాకాలం ఏసీ ఎంతో అవసరం అని, ఈ రోజుల్లో ఏసీ వినియోగం సామాన్యమైపోయిందని.
మసీదుకు ఏసీ ని దాతల ద్వారా వితరణ చేయడంలో నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరియు బండిపాలెం మదీనా మజీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా మసీదులో నమాజు చదివే భక్తుల కోసం యేసుని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ *షేక్ సైదాను సమాజ్ సేవ సైదా* అని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదీనా మసీదు కమిటీ సభ్యులు హబీబుల్లా మరియు, షేక్ అజిత్ భాయ్, షేక్ మొగలా సాహెబ్, సయ్యద్ జాన్ సైదా, షేక్ కరీముల్లా, సయ్యద్ బడేమియా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ జాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.










