అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిప్రమాదాలు నివారణపై అవగాహన కల్పించారు. ఆసుపత్రిలలో అగ్నిప్రమాదాలు జరిగితే రోగులను ఎలా కాపాడాలి, మంటలను ఎలా అదుపు చేయాలో వివరించారు. ఫైర్ ఎక్సటింగ్ విషర్స్ వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు.
#Boiena Rajesh










