చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి

0
1

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జరిగింది.వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో పాటు అన్న క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం వడ్డించి, ఈ సందర్భంగా శ్రీమతి నారా భువనేశ్వరి గారు చేసిన రూ 76 లక్షల విరాళం గురించి వివరించారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేసి, 8వ వార్డులో ఏర్పాటు చేసిన త్రాగునీటి చెలివేంద్రని ప్రారంభించారు.ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు, రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ ఛైర్మన్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, ఏఎంసీ ఛైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, తెలుగు మహిళలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.