మదనపల్లిలో కబడ్డీ పోటీలు ఘనంగా ముగింపు.

0
2

మదనపల్లె జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం క్రీడాభారతి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలు పాల్గొన్నారు. అండర్-14లో నెహ్రూ మున్సిపల్ స్కూల్.

అండర్-17లో కలిచెర్ల జెడ్పీ స్కూల్, అండర్-19లో జ్ఞానాంబిక కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి. ముగింపు కార్యక్రమంలో అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి దోహదం చేస్తాయని అతిథులు పేర్కొన్నారు.