మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు………. మరో అరెస్టు

0
2

మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో జమున అనే మహిళ కిడ్నీ

తొలగించి అక్రమంగా అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో డయాలసిస్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్ల సత్య, పద్మ, సూరిబాబు, డా. ఆంజనేయులు, పార్థసారథి తదితరులపై గతేడాది నవంబర్ 16న కేసు నమోదు చేసి పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే కేసులో 20వ నిందితుడిగా ఉన్న నవీన్ బాబును ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది