మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం ఇదే తొలిసారి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.










