ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని MRO ధ్రువ కుమార్, ఎంపీడీవో నరసింహారావు అన్నారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ
అందజేసిన మొక్కలను వారు కార్యాలయ ప్రాంగణంలో నాటారు, చెట్లను నరికి వేయడం వల్లనే ఎండ తీవ్రత పెరుగుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.










