రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్
రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ రంగానికి గట్టి ప్రోత్సాహం అందిస్తున్నదని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మినేని జ్వాలా ప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి ఆయన రైతులతో సమావేశమై ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారుఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల ఆర్థిక భారం తగ్గించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సౌమ్య గారి పాత్ర ప్రశంసనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.
గత ప్రభుత్వ కాలంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందని, వ్యవసాయ పరికరాలపై సరైన సబ్సిడీలు అందలేదని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు గణనీయమైన సబ్సిడీలు అందిస్తూ వ్యవసాయ రంగానికి నూతన ఊపిరి పోస్తోందన్నారు.
ప్రస్తుతం ట్రాక్టర్లపై సుమారు ₹3 లక్షల వరకు, పవర్ టిల్లర్లపై ₹1 లక్ష నుంచి ₹2 లక్షల వరకు, రోటావేటర్లు మరియు కల్టివేటర్లపై ₹50,000 నుంచి ₹1.5 లక్షల వరకు, స్ప్రేయర్లపై ₹10,000 నుంచి ₹50,000 వరకు సబ్సిడీ లభిస్తున్నట్లు తెలిపారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్స్‌పై ₹30,000 నుంచి ₹1.5 లక్షల వరకు, హార్వెస్టర్లపై ₹3 లక్షల నుంచి ₹8 లక్షల వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సబ్సిడీలు రైతులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడమే కాకుండా, ఆధునిక వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమలు చేసేందుకు దోహదపడుతున్నాయని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమీప వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చంద్రన్న ప్రభుత్వ పథకాలను ప్రతి రైతు పూర్తిగా ఉపయోగించుకోవాలని జ్వాలా ప్రసాద్ పిలుపునిచ్చారు.










