తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెలువోలు చిట్టిబాబు నియామకం

0
0

భారతీయ జనతా పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కోదాడ బిజెపి సీనియర్ నాయకులు వెలువోలు చిట్టి బాబు ను నియమిస్తూ నియామక పత్రం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు అందజేసినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ రెండోసారి నా నియామకానికి సహకారం అందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, కోదాడ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భారతీయ జనతా పార్టీ నమ్మకంతో నాకు అప్పగించిన పదవిని వమ్ము చేయకుండా రైతులకు ఏ సమస్య వచ్చినా సకాలంలో అందుబాటులో ఉండి బిజెపి పార్టీ తరఫున పరిష్కరిస్తానని వారు తెలిపారు.అదేవిధంగా పార్టీ అభివృద్ధికి కార్యకర్తలకు పూర్తి సహకారం తోడ్పాటు అందిస్తా నని తెలిపారు.