పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం (ఆర్చ్)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి గ్రామ ప్రవేశ ద్వారాలు ఒక ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ సౌందర్యవృద్ధితో పాటు, స్థానికులకు గర్వకారణంగా ఈ ఆర్చ్ నిలుస్తుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
స్వంత నిధులతో ఈ గ్రామ ప్రవేశ ద్వారాన్ని నిర్మించిన రామ్ అఖిల్‌ను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎంపీ గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. యాంకర్ రవి మరియు ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.










