ఎమ్మెల్యే జిఎంఆర్‌ను పరామర్శించిన హరీష్ రావు బృందం |

0
3

ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని శనివారం సాయంత్రం మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు తన సహచర ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్ లతో కలిసి పరామర్శించారు.

ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ… పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపనపడే ఎమ్మెల్యే జిఎంఆర్ గారు త్వరగా కోలుకొని.. ప్రజా సేవలోకి రావాలని ఆయన ఆక్షాక్షించారు.