అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మదనపల్లె జనసేన నాయకులు రాంమోహన్, నరేంద్ర, అజయ్, హరి, ఆలయ కమిటీ సభ్యులు తరుణ్, శ్రీనాథ్, ప్రవీణ్ తదితరులు అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవం ఘనంగా జరిగింది.










