శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం,,హెల్మెట్‌పై అవగాహన

0
2

చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని ఈరోజు మసీద్ సెంటర్‌లో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ,,ఎండి, మోయిన్, సీఐలు , రూరల్ టౌన్ ఎస్సైలు, పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతో కీలకమని వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపేవారిపై తప్పనిసరిగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
అనంతరం చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

#Narendra