పెట్రోల్,డీజిల్ కొరతతో బంకుల మూసివేత అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

0
2

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరఫరా లోపంతో వందలాది పెట్రోల్ బంకులు మూతపడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్యానిక్ కొనుగోళ్ల వల్ల డిమాండ్ భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి, నిల్వలు పెంచాలని సూచించారు.

 

ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. పరిస్థితిని సమీక్షిస్తూ సాయంత్రంలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు.