మదనపల్లె టౌన్ పరిధిలో సోమవారం జరిగిన ఘటనలో, ములకలచెరువు మండలం తుమ్మనగుట్టకు చెందిన భారతి (35) తన కుమార్తెలు భానుప్రియ (14), తేజశ్రీ (12)లతో కలిసి బైక్పై పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా, తంబళ్లపల్లె మండలం కొటాల వద్ద అకస్మాత్తుగా జింక అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. తేజశ్రీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు.








