మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఆదివారం ఉదయం 5 గంటల నుంచే కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు వంటి ప్రాంతాలను పర్యటించి.
శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ్య కార్మికులకు కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించి, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.










