పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులేమో కొరతలేదని చెబుతున్నప్పటికీ బంకుల్లో ఇంధనం లేక సోమవారం ప్రజలు బారులు తీరుతున్నారు.
కొన్ని బంకుల్లో పూర్తిగా ఇంధనం లేకపోవడంతో ఒక చోట నుండి మరో చోటుకు తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.










