పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గాజుల స్వామి తన మనవరాలు ఫంక్షన్ కోసం గోదావరిఖనికి వెళ్లగా…
గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి, రూ 5000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI శ్వేత గారు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో కేసు దర్యాప్తు చేపట్టారు










