మే 6 న వరంగల్ లో బి ఆర్ ఎస్ సభ…..

0
5

భారత్ అవాజ్ న్యూస్: 6న వరంగల్లో బీఆర్ఎస్ సభ!

హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BHARAT RASHTRA SAN

BRS భారత రాష్ట్ర సమితి..

వాలుగేండ్ల కింద హన్మకొండలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అన్నదాతలకు కీలక హామీలిచ్చిన రాహుల్, రేవంత్ హామీలు అమలు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ ఈ మేరకు కాంగ్రెస్ మోసంపై రైతులతో సభభారీగా రైతులను సమీకరించాలని నిర్ణయం కేటీఆర్తో ఉమ్మడి జిల్లా నేతల సమావేశం

జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం..

“భారత రాష్ట్ర సమితు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు…

చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ మే 6న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించి, రైతులకు కీలక హామీలు ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా ఆ హామీలను నెరవేర్చలేదని, రైతులను మోసం చేసిందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వరంగల్ లో సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం సభ నిర్వహణ, రైతు డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టడం, రైతు సమస్యలపై పోరాటం వంటి అంశాలపై ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది… రిపోర్టర్ జి రాము