మదనపల్లెలో గంజాయికి బానిసైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్కు తరలించారు. కురబలకోట మండలానికి చెందిన వీరిలో మార్పు తీసుకురావాలని డీఎస్పీ పావని ఆదేశించారు.
ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు వారిని మదనపల్లెలోని డీ-అడిక్షన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ అందించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ చికిత్స కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.










