నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.

0
2

తూర్పు కనుమలకే ప్రత్యేకమైన, అత్యంత అరుదైన పీకాక్ టరంటులా (నీలం రంగు సాలీడు) పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్రంగా అంతరించిపోతున్న ఈ జీవి మనుగడను కాపాడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ఇందులో భాగంగా నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ శాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సంయుక్తంగా సర్వేను ప్రారంభించాయి. ఈ సర్వే ద్వారా నల్లమల అడవుల్లో వీటి జనాభా, ఆవాసాలను గుర్తించి, పటిష్టమైన పరిరక్షణ ప్రణాళికలు రూపొందించనున్నారు. జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.