కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?

0
3

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ‘టీఆర్‌ఎస్’ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కవిత ప్రకటించిన కొత్త పార్టీకి టీఆర్‌ఎస్ (TRS) పేరును కేటాయించవద్దని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకత్వం పావులు కదుపుతోంది.

ఈ మేరకు బీఆర్‌ఎస్ కీలక నేత ఒకరు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అధికారితో ఫోన్‌లో చర్చించినట్లు సమాచారం. తమ పాత పేరుతో కొత్త పార్టీ వస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే, పార్టీల పేర్ల కేటాయింపు ప్రక్రియపై ఫోన్‌లో వివరణ ఇవ్వలేమని, ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సదరు అధికారి సూచించినట్లు తెలుస్తోంది. ఈ పేరును అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేసే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.