రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా సేవలు పొందాలని స్పష్టం చేశారు. కర్నూలు డ్రోన్ సిటీ తొలి దశ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని, 8 కంపెనీలకు భూ కేటాయింపులు పూర్తయ్యాయని వెల్లడించారు.
నేర నియంత్రణ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సీసీ కెమెరాల డేటాను అనుసంధానించాలని, శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌కు జోడించి విపత్తుల వేళ వేగంగా స్పందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.










